పీఎన్‌బీ లాభం అప్‌ | Punjab National Bank Q4 Results: Profit rises 14 Percent to Rs 5225 crore and NII dips: Rs 3 dividend declared | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ లాభం అప్‌

May 6 2026 2:58 AM | Updated on May 6 2026 8:01 AM

Punjab National Bank Q4 Results: Profit rises 14 Percent to Rs 5225 crore and NII dips: Rs 3 dividend declared

క్యూ4లో రూ. 5,225 కోట్లు 

షేరుకి రూ. 3 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14% ఎగసి రూ. 5,225 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2024–25) ఇదే కాలంలో రూ. 4,567 కోట్లు ఆర్జించింది.

వాటాదారులకు బ్యాంక్‌ బోర్డ్‌ షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్ప వెనకడుగుతో రూ. 36,319 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 36,705 కోట్ల  ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.95% నుంచి 2.95 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.4 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి.  
ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ షేరు బీఎస్‌ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 108 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement