10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం | shreyas group expansion plan 10000 entrepreneurs target in telugu states | Sakshi
Sakshi News home page

10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం

May 5 2026 1:05 AM | Updated on May 5 2026 1:05 AM

shreyas group expansion plan 10000 entrepreneurs target in telugu states

శ్రేయాస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు శ్రీనివాస్‌రావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌ సంస్థ శ్రేయాస్‌ గ్రూప్‌ తాజాగా మీడియా, స్పోర్ట్స్‌ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్‌రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్‌ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. 

ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్‌రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్‌ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్‌ క్లబ్, ఉత్సవ్‌ పేరిట ఈవెంట్స్‌ రంగంలో, ఫ్యూచర్‌ సిటీ డెవలపర్స్‌ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్‌ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్‌ స్టూడియో, ఎనీటైమ్‌ థియేటర్‌ అనే వినూత్న వినోద ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement