చేయడానికి ఒక ఉద్యోగం, మంచి జీతం వస్తే చాలు, అనుకునేవాళ్లే సంఘంలో చాలామంది ఉన్నారు. ఇందులో కొందరికి సొంతంగా ఏదైనా బిజినెస్ లేదా నచ్చినపని చేయాలని ఉన్నప్పటికీ.. భయం లేదా ఇతరత్రా కారణాల వల్ల ముందడుగు వేయరు. కానీ.. అమన్ గోయల్ అనే యువకుడు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఇంటర్న్‌షిప్ వదిలి, సొంతగడ్డపై స్టార్టప్ ప్రారంభించాలని స్వదేశానికి వచ్చేసాడు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో చదువుతున్నప్పుడే అమన్ గోయల్.. కేవలం 20 సంవత్సరాల వయసులో అమెరికాలోని రుబ్రిక్ అనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందాడు. ఆ సమయంలో ఆయన జీతం నెలకు 8,000 డాలర్లు (రూ.7.5 లక్షలు). కానీ ఇది అతనికి అంతగా నచ్చలేదు.
తన భవిష్యత్తు అమెరికాలో కాకుండా.. భారతదేశంలో ఉందని అమన్ గోయల్ గ్రహించాడు. నేను కూడా ఒక కంపెనీని నిర్మించాలి, నా దేశంలోనే ఎదగాలి అనే ఆలోచన అతనిలో బలపడింది. అందుకే తిరిగి భారతదేశానికి వచ్చి, కేవలం ఇంజనీరింగ్ జ్ఞానంతో సరిపెట్టుకోకుండా.. వ్యాపారం నిర్మాణం గురించి కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
Ten years ago, I landed in San Francisco as a 20-year-old kid from IIT Bombay, headed to Palo Alto to intern at @rubrikInc's Software Engineering Team.
I was earning $8,000 a month. It felt like a dream.
My mentor was an @CSE_IITBombay senior, who made me fall in love with… pic.twitter.com/EjphbHWNs9— Aman Goel (@amangoeliitb) May 9, 2026
కాలేజీలో చదువుతున్న చివరి సంవత్సరంలోనే వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ప్రొడక్ట్ డిజైన్, సేల్స్ వంటి విషయాలను అభ్యసించాడు. “ఇంజనీరింగ్ నా బలం అయినా, వ్యాపారం నిర్మించడం నా అసలు లక్ష్యంగా మారింది” అని అమన్ గోయల్ చెప్పాడు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!
కొన్ని సంవత్సరాల తరువాత, అతడు స్థాపించిన GreyLabs AI అనే సంస్థ 85 మందికి పైగా ఉద్యోగులతో పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి, ప్రతి సంవత్సరం మూడు రెట్లు వృద్ధిని సాధిస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా వృద్ధిలోకి రాలేదు. ఎన్నో రిస్కులు, కష్టాలు, అనిశ్చితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గొప్ప వృద్ధిని సాధించగలిగింది.


