ఆ రాష్ట్రంలో క్యాబ్, బైక్ ట్యాక్సీలపై నిషేధం! | Maharashtra Govt Issues Notices To Apple And Google To Remove Uber Ola Rapido Apps, Check Out For Reason Inside | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రంలో క్యాబ్, బైక్ ట్యాక్సీలపై నిషేధం!

May 16 2026 4:16 PM | Updated on May 16 2026 4:36 PM

Remove Uber Ola Rapido apps Maharashtra Govt Issues Notices to Apple and Google

నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ క్యాబ్, రైడ్ సేవలను నిలిపివేయాలని.. యాపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్స్ నుంచి సంబంధిత యాప్స్ తొలగించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఆ కంపెనీల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాపిడోకు అగ్రిగేటర్ లైసెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో, 2022 చివరిలో బైక్ ట్యాక్సీలతో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైంది. రాపిడో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జనవరి 2023 నాటికి అన్ని బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేశారు. చివరికి బైక్ ట్యాక్సీల కోసం ఒక అగ్రిగేటర్ విధానాన్ని రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement