మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు! | Harsh Goenka Directs Employees After PM Modi Appeal | Sakshi
Sakshi News home page

మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!

May 14 2026 9:09 PM | Updated on May 14 2026 9:18 PM

Harsh Goenka Directs Employees After PM Modi Appeal

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.

ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్‌ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్‌ ద్వారా వెల్లడించారు.

విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.

ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్‌పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement