డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా | Your Money Is Losing Value Robert Kiyosaki Explains Why | Sakshi
Sakshi News home page

డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

May 14 2026 3:09 PM | Updated on May 14 2026 3:57 PM

Your Money Is Losing Value Robert Kiyosaki Explains Why

పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.

మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.

ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.

డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం  త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?

గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement