బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా? | Dont Buy Gold Indira Gandhi Front Page Photo Viral Know The Facts | Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?

May 12 2026 7:37 PM | Updated on May 12 2026 8:08 PM

Dont Buy Gold Indira Gandhi Front Page Photo Viral Know The Facts

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్ర‌జ‌లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్‌గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.

నిజం ఏమిటంటే?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్‌గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్‌లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.

ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?
వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.

ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!

Advertisement
 
Advertisement
Advertisement