సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెప్పే రాబర్ట్ కియోసాకి.. తాజాగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందని.. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త అని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఇలా ఎందుకు అన్నారు?, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును చూడగలరు. ఉదాహరణకు.. నేను 1965లో వెండి ధర చాలా తక్కువ ఉండేది. ఆ సమయంలోనే వెండిని పోగు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ నాటి నుంచి పోగు చేసిన సిల్వర్ ఇప్పుడు నా అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా నిలిచిందని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ పేర్కొన్నారు.
కియోసాకి ట్వీట్‌లో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఇందులో ఒకటి 'భవిష్యత్తులో ఏమి జరగబోతోందని మీరు భావిస్తున్నారు?'. మరొకటి, భవిష్యత్తులో లాభం పొందడానికి మీరు దేనిలో పెట్టుబడి పెట్టగలరు?'. ఈ ప్రశ్నలకు నెటిజన్లు తమదైన రీతిలో జవాబులు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ
పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అని చెబుతూనే.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త. అంధులకు ఇది దుర్వార్త. అని కియోసాకి తన ట్వీట్ ముగించారు.
వెండి ధరలు ఇలా..
నిజానికి వెండి ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి రూ.90 వేల వద్ద ఉన్న కేజీ సిల్వర్ ధర, 2026 ప్రారంభంలో రూ.2.34 లక్షలకు చేరింది. ఆ తరువాత రూ.3.85 లక్షలకు చేరి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కాగా ఇప్పుడు వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వెండి ధరలలో ఎలాంటి పరిణామాలు జరిగాయో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.


