ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ | Five Days of Work a Week and Still Ending Up in Debt Says Kiyosaki | Sakshi
Sakshi News home page

ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ

May 10 2026 6:15 PM | Updated on May 10 2026 6:41 PM

Five Days of Work a Week and Still Ending Up in Debt Says Kiyosaki

పెట్టుబడుల గురించి, ఆర్థికపరమైన విషయాలను చెప్పే 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు ఉద్యోగుల గురించి, వారి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉద్యోగి ప్రతి వారం ఐదు రోజులు చాలా కష్టపడి పనిచేస్తాడు. ఉదయం నిద్రలేచి ఆఫీసుకు వెళ్లడం, ట్రాఫిక్‌లో ప్రయాణించడం, ఎప్పటికీ ముగియని పనులను పూర్తి చేయడం. ఇవన్నీ చేస్తూ.. చేస్తూ చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. ఇలాంటి సమయంలో 'జీవితాంతం ఇలాగే కొనసాగాలా?' అనే ప్రశ్న మనసులో పుడుతుంది.

అంటే.. దీని అర్థం పని చేయకుండా ఉండటం కాదు. సోమరితనం అంతకంటే కాదు, కృతఙ్ఞతలేకపోవడం కూడా కాదు. నీ కష్టం అంతా మరొకరి కలలను నిజం చేయడానికి వెళ్తోందనే భావన వల్ల కలిగే అలసట మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.

ఆర్థిక ప్రపంచంలో నాలుగు (E, S, B, I) ప్రధానమైన విభాగాలు మాత్రమే ఉన్నాయని, వీటి గురించి కియోసాకి వివరంగా వివరించారు.

E – Employee (ఉద్యోగి)
S – Self-Employed (స్వయం ఉపాధి పొందినవాడు)
B – Business Owner (వ్యాపార యజమాని)
I – Investor (పెట్టుబడిదారు)

చాలామంది జీవితాంతం E విభాగంలోనే ఉంటారు. అంటే.. ఉద్యోగం చేస్తూ జీతం మీద ఆధారపడతారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వీళ్లే ఎక్కువ పన్నులు చెల్లిస్తుంటారు. జీతం చేతికి రాకముందే ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది. తరువాత మిగిలిన డబ్బుతోనే ఎంప్లాయ్ జీవించాలి.

ఈ సమయంలో కియోసాకి పూర్ డాడ్ గురించి పేర్కొన్నాడు. ఆయన చాలా చదువుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు. చాలా కష్టపడే వ్యక్తి. మంచి ఉద్యోగమే భద్రత అని నమ్మేవారు. కానీ జీవితాంతం కష్టపడి పనిచేసినా.. చివరికి అప్పులు మిగిలాయి.

ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

రిచ్ డాడ్ ఆలోచన మాత్రం.. పూర్ డాడ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. ఈయన B, I విభాగాలను ప్రధాన్యత ఇచ్చారు. ఇందులోనే జీవించారు. అంటే వ్యాపారాలు నిర్మించారు, పెట్టుబడులు కూడా పెట్టారు. ఈయన డబ్బుకోసం పనిచేయలేదు, తన కోసం పనిచేసే వ్యవస్థలను నిర్మించాడు. అందువల్ల పన్నుల చట్టాలు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశాయి.

ఒక ఉద్యోగి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్నులుగా వెళ్లిపోతాయి. కానీ ఒక వ్యాపారవేత్త అదే డబ్బును వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టి, ఆస్తులు పెంచుకుని, చివర్లో మాత్రమే పన్నులు చెల్లిస్తాడు. అంటే ఒకే దేశం, ఒకే ఆర్థిక వ్యవస్థ అయినా.. నియమాలు అందరికీ ఒకేలా పనిచేయవు.

Facebook Story Reference

This content is shared via Facebook Story (temporary content).

Open Story on Facebook 

Advertisement
 
Advertisement
Advertisement