2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే? | Robert Kiyosaki Reveals Which Assets Can Survive Market Crashes | Sakshi
Sakshi News home page

Robert Kiyosaki: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

May 7 2026 7:27 PM | Updated on May 7 2026 8:03 PM

Robert Kiyosaki Reveals Which Assets Can Survive Market Crashes

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.

పేపర్ ఆస్తులు
కియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.

➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం
➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం
➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకం

అంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట.

 
 

రియల్ ఆస్తులు
రాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.

భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.

ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

ప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.

ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement