అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా! | Indian Origin OpenAI CTO Srinivas Narayanan Quits Plans To Spend Time With Parents In India | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!

Apr 27 2026 9:15 PM | Updated on Apr 27 2026 9:20 PM

Indian Origin OpenAI CTO Srinivas Narayanan Quits Plans To Spend Time With Parents In India

ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.

నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్‌కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?
శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్‌లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్‌బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement