దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం | Bharat Mata Needs You Zoho Sridhar Vembu Tweet | Sakshi
Sakshi News home page

దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం

Apr 27 2026 7:34 PM | Updated on Jun 18 2026 1:00 PM

Bharat Mata Needs You Zoho Sridhar Vembu Tweet

జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్‌లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్‌లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!

ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement