వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్! | Oracle To Cut Over 20000 Jobs Is AI Hitting Senior Employees First | Sakshi
Sakshi News home page

వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!

Apr 27 2026 4:12 PM | Updated on Apr 27 2026 4:37 PM

Oracle To Cut Over 20000 Jobs Is AI Hitting Senior Employees First

టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.

దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.

దీనికి ఉదాహరణ.. ఒరాకిల్‌లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్‌ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్‌గా అనిపించిందని తెలిపారు.

ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్‌లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.

ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

 ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్‌ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement