భారీగా బంగారం అమ్మేసిన రష్యా! | Why Has Russia Sold 22000 Kgs of Gold in 2026 | Sakshi
Sakshi News home page

భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Apr 26 2026 3:20 PM | Updated on Apr 26 2026 4:05 PM

Why Has Russia Sold 22000 Kgs of Gold in 2026

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.

2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.

పాశ్చాత్య దేశాల ఆంక్షలు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.

లోటు బడ్జెట్!
2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.

ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తి
ప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Advertisement
 
Advertisement
Advertisement