బెంగళూరు టెక్కీ ఐడియాపై నెటిజన్ల డిబేట్! | Bengaluru Creator Suggests Free Workspaces In Malls For Remote Workers, Sparks Online Debate, Video Went Viral | Sakshi
Sakshi News home page

బెంగళూరు టెక్కీ ఐడియాపై నెటిజన్ల డిబేట్!

May 15 2026 12:43 PM | Updated on May 15 2026 12:48 PM

Bengaluru Viral Hack Free WiFi AC Workspaces Malls Spark Debate

భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో జీవన వ్యయం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, నిత్యావసరాలు.. ఇలా చాలా వాటికి అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ ఉద్యోగాలు చేసే వారి కోసం ఓ బెంగళూరు యువకుడు కొత్త ఆలోచన ప్రతిపాదించాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. ఉచిత వైఫై, ఫుల్ ఏసీ, మొబైల్/ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లతో మాల్స్‌లోనే రోజంతా ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకోవచ్చంటూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది.

సీక్రెట్ స్పాట్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో అమోల్ నారంగ్ అనే కంటెంట్ క్రియేటర్ ‘బెంగళూరులో ఉచితంగా ల్యాప్‌టాప్‌పై కూర్చుని పని చేయండి - పార్ట్ 1’ అనే శీర్షికతో ఒక వీడియోను పంచుకున్నాడు. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ మాల్‌ను ఎంచుకున్న అతడు, అక్కడ చట్టబద్ధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా పని చేయవచ్చో ఐదు లొకేషన్లతో సహా వివరించాడు. ‘వైట్‌ఫీల్డ్‌లో ఉచిత వైఫై, ఏసీ ఎలాంటి ఛార్జీ లేకుండా రోజంతా పని చేయవచ్చు’ అంటూ ఆ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో వైరల్‌గా మారింది.

నెటిజన్ల స్పందన

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఐడియా భలే ఉందే అని మెచ్చుకుంటుంటే, మెజారిటీ ఐటీ నిపుణులు, నెటిజన్లు మాత్రం ఇందులోని ఇబ్బందులను, భద్రతా లోపాలను ఎత్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement