అదానీ పవర్‌ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్‌ | Adani Power Q4 Results Net Profit Surges Check Details | Sakshi
Sakshi News home page

అదానీ పవర్‌ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్‌

Apr 30 2026 5:43 PM | Updated on Apr 30 2026 6:12 PM

Adani Power Q4 Results Net Profit Surges Check Details

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం అదానీ పవర్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి.

అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం  రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్‌(1,600 మెగావాట్లు), రాయ్‌పూర్‌(1,600 మెగావాట్లు), రాయ్‌గఢ్‌(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86–47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.

సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్‌ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031–32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఎల్‌వోఏను అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement