డాలర్‌ ‘బిగ్‌ బాస్‌’ గుప్తా కన్నుమూత | Dollar Industries Founder Deen Dayal Gupta Passes Away At Age Of 88 | Sakshi
Sakshi News home page

డాలర్‌ ‘బిగ్‌ బాస్‌’ గుప్తా కన్నుమూత

May 3 2026 7:48 AM | Updated on May 3 2026 11:33 AM

Dollar Industries Founder Deen Dayal Gupta Passes Away at 88

కోల్‌కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్‌ దీన్‌దయాళ్‌ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్‌ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్‌కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.

1972లో డాలర్‌ ఇండస్ట్రీస్‌కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement