భారత్‌లో ఎడోబ్‌ విస్తరణ  | Adobe opens big new office in Noida | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఎడోబ్‌ విస్తరణ 

May 9 2026 5:41 AM | Updated on May 9 2026 8:12 AM

Adobe opens big new office in Noida

నోయిడాలో మరో కొత్త కార్యాలయం 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం ఎడోబ్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశీయంగా ఏడో ఆఫీసు. ఇందులో 700 మంది పైగా ఉద్యోగులు ఉంటారు. 1997లో ఇంజినీరింగ్‌ ఆర్‌అండ్‌డీ సెంటరుగా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఎడోబ్‌ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించింది. 

ప్రస్తుతం అమెరికా వెలుపల చూస్తే ఇక్కడే అత్యధికంగా 8,000 మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీ మార్కెట్లో కంపెనీ ఇటీవలి కాలంలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రెడిషన్‌ ఉన్న సంస్థల విద్యార్థులకు ఫైర్‌ఫ్లై, ఫొటోషాప్, యాక్రోబ్యాట్‌లాంటి ఏఐ ఆధారిత టూల్స్‌ని ఉచితంగా అందించేలా 2026 ఫిబ్రవరిలో కంపెనీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కి చెందిన 36 కోట్ల మంది యూజర్లకు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియంను ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement