70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు! | PhonePe Surpasses 700 Million Registered Users | Sakshi
Sakshi News home page

70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు!

May 1 2026 4:58 PM | Updated on May 1 2026 5:08 PM

PhonePe Surpasses 700 Million Registered Users

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్‌ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. 

తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement