తెలంగాణలో న్యూట్రిషన్‌ నెక్ట్స్‌ తయారీ ప్లాంటు | Nutrition Next To Set Up Pet Food Manufacturing Plant In Telangana By FY2027, Check More Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణలో న్యూట్రిషన్‌ నెక్ట్స్‌ తయారీ ప్లాంటు

May 3 2026 1:47 PM | Updated on May 3 2026 3:09 PM

Nutrition Next to Set Up Pet Food Manufacturing Plant in Telangana by FY2027

హైదరాబాద్‌: పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులకు సంబంధించి తెలంగాణలోని వర్గల్‌లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు న్యూట్రిషన్‌ నెక్ట్స్‌ సహ వ్యవస్థాపకులు వెంకట ధర్మేంద్ర బొప్పన తెలిపారు. కొత్తగా పిల్లుల కోసం పేరెంట్‌ పేరిట, శునకాల కోసం బోనస్‌ పేరిట ట్రీట్స్‌ ఆహారోత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.

అంతర్జాతీయ పోషకాహార ప్రమాణాలకి అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్‌ వార్షికంగా 5.2 శాతం వృద్ధి రేటుతో 8.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుందని వ్యవస్థాపకుడు, సీఈవో సి. ప్రహర్ష తెలిపారు. తెలిపారు.

ఇందులో ఆహారం, ట్రీట్స్‌ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, 2.52 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పుణె, ముంబై తదితర ఐదు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాల్లోను విస్తరించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement