తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకు సెలవులు | Bank Holidays in May Banks to remain closed for 9 days in Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకు సెలవులు

Apr 30 2026 2:10 PM | Updated on Apr 30 2026 2:27 PM

Bank Holidays in May Banks to remain closed for 9 days in Telugu States

డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు ఎంత పెరిగినా నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇలా ఈ మే నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నవారి కోసం ఈ కథనం. ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2026 నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. మే నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, జయంతి కార్యక్రమాలు మరియు వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు.

తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు
ఈ మే నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు వారాంతపు సెలవులు, పండుగలతో కలిపి మొత్తం 9 రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించే బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ముందస్తు ప్రణాళిక లేకపోతే మీ అత్యవసర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి, సెలవుల జాబితాను ఒకసారి పరిశీలించండి..

సెలవుల వివరాలు
మే 1 - శుక్రవారం - మే డే (కార్మిక దినోత్సవం) / బుద్ధ పూర్ణిమ
మే 3 - ఆదివారం - సాధారణ సెలవు
మే 9 - శనివారం - రెండో శనివారం
మే 10- ఆదివారం- సాధారణ సెలవు 
మే 17- ఆదివారం - సాధారణ సెలవు
మే 23 - శనివారం - నాలుగో శనివారం
మే 24 - ఆదివారం - సాధారణ సెలవు
మే 27 - బుధవారం- బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా)
మే 31 - ఆదివారం - సాధారణ సెలవు
అయితే చంద్రుని దర్శన ఆధారంగా బక్రీద్ సెలవు తేదీలో మార్పు ఉండవచ్చు.

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..
బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు (ATM) యధావిధిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధుల బదిలీ (NEFT/RTGS/IMPS) చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement