ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ | Infosys CEO Salil Parekh on AI impacting Job Market | Sakshi
Sakshi News home page

ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ

Apr 30 2026 5:35 PM | Updated on Apr 30 2026 6:09 PM

Infosys CEO Salil Parekh on AI impacting Job Market

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.

కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్‌పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.

ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

Advertisement
 
Advertisement
Advertisement