ల్యాప్‌టాప్‌, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి | AI Is Changing Business Robert Kiyosaki Big Prediction | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి

May 16 2026 8:59 PM | Updated on May 16 2026 9:18 PM

AI Is Changing Business Robert Kiyosaki Big Prediction

పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.

ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్‌టాప్‌, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.

ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు.

 
 

పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్‌ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్‌లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

పెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement