జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు! | Gen Z Does not Work Hard Entrepreneur Says That Idea Is Completely Wrong Tweet Viral | Sakshi
Sakshi News home page

జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!

May 9 2026 3:02 PM | Updated on May 9 2026 3:45 PM

Gen Z Does not Work Hard Entrepreneur Says That Idea Is Completely Wrong Tweet Viral

నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.

''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.

జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.

జెన్ జీ ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. అవసరమైతే 'ఇది సరైనది కాదు' అని ధైర్యంగా చెప్పగలరు. కొందరు దీనిని అహంకారంగా భావించినా, వాస్తవానికి అది వారి ఆత్మవిశ్వాసానికి సూచిక. సరైన ప్రోత్సాహం, గౌరవం, అర్థం చేసుకునే నాయకత్వం లభిస్తే.. వారు సంస్థకు ఎంతో విలువైనవారిగా మారగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

రోహిత్ ఆర్యన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది ఆర్యన్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తాము కూడా జెన్ జెడ్ ఉద్యోగులతో మంచి అనుభవాలు పొందామని చెప్పారు. సరైన మార్గదర్శనం, స్వేచ్ఛ, నమ్మకం ఇస్తే ఈ తరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement