ఇటలీలో నిర్వహించిన స్పేస్ మీటింగ్స్ వెనిటోలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) సారథ్యంలో భారత్ నుంచి తొమ్మిది స్పేస్ టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. ధృవ స్పేస్, ఆస్ట్రోగేట్ ల్యాబ్స్, వ్యోమ్‌ఐసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా కెప్లర్ ఏరోస్పేస్, ఆస్ట్రోబేస్ మొదలైనవి అక్కడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే అంతరిక్ష రంగానికి సంబంధించి సాంకేతిక, వాణిజ్య భాగస్వామ్య అవకాశాలపై ఇరు దేశాల సంస్థలు చర్చించాయి.


