ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్! | Spirit Airlines Shuts Operations After 33 Years of Service Due to Fuel Price Surge | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్!

May 2 2026 9:16 PM | Updated on May 2 2026 9:29 PM

Spirit Airlines Shuts Operations After 33 Years of Service Due to Fuel Price Surge

సుమారు మూడు దశాబ్దాలు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలను అందిస్తున్న అమెరికన్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్, తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, తక్షణమే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని.. ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.

ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మా ప్రయాణికులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. కాగా ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు కూడా వెల్లడించింది.

కోవిడ్ తరువాత స్పిరిట్ కంపెనీ లాభాలను ఆర్జించకపోగా.. ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. దీంతో సంస్థ తన సర్వీసులను నిలిపివేయడానికి సన్నద్ధమైంది. ఈ ప్రభావం సుమారు 17వేలమంది ఉద్యోగులపై పడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement