జాబ్ వదిలి బిజినెస్ చేస్తే.. జీవితం ఇంత కష్టమా? | Entrepreneur Mehul Agarwal’s Honest Take On Startup Life, Quitting Your Job Isn’t Freedom, Reality Is Harder Than You Think | Sakshi
Sakshi News home page

జాబ్ వదిలి బిజినెస్ చేస్తే.. జీవితం ఇంత కష్టమా?

May 15 2026 3:07 PM | Updated on May 15 2026 4:23 PM

Quit Job And Start Business The Reality Is Harder Than You Think

ఉద్యోగం చేసే చాలామంది.. జాబ్ వదిలేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇలాంటి సలహాలే చాలామంది చెబుతుంటారు కూడా. కానీ అదంతా తప్పు, అనుకున్నంత సులభమేమీ కాదంటున్నారు.. యువ వ్యాపారవేత్త మెహుల్ అగర్వాల్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిజిటల్ క్రియేటర్.. యువ వ్యాపారవేత్త మెహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇందులో ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం ఎంత కష్టమైన ప్రయాణమో ఆయన నిజాయితీగా వివరించారు.

సాధారణంగా చాలామంది 'జాబ్ వదిలేస్తే స్వేచ్ఛ వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది' అని భావిస్తారు. కానీ జాబ్ వదిలేశాక తెలుస్తుంది ఎన్ని బాధ్యతలు పెరుగుతాయో. ఈ విషయాలను ఆయన తన అనుభవం ద్వారా వెల్లడించారు.

మెహుల్ ప్రకారం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిన మొదటి రోజు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఉదయం త్వరగా లేచి తన కంపెనీ భవిష్యత్తు కోసం వచ్చే మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేశాడు. కొత్త ప్రయాణం ప్రారంభమవుతోందనే ఆనందం అతనిలో కనిపించింది. రెండో రోజు ఆ ప్రణాళికను మళ్లీ మార్చి మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. అయితే.. మూడో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన నిర్ణయం సరైందా కాదా అనే అనుమానాలు మొదలయ్యాయని మెహుల్ తెలిపాడు.

భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక భయం, ఆందోళన కలిగాయని చెప్పాడు మెహుల్ వీడియోలో వెల్లడించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ పని మాత్రమే అప్పగించేవాడు, కానీ ఇప్పుడు అన్ని పనులు తానే చూసుకోవాల్సి వచ్చిందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఒక వ్యాపారవేత్త ఎదుర్కొనే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే.. తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదని మెహుల్ పేర్కొన్నాడు. ఎందుకంటే నచ్చని, ఒత్తిడి కలిగించే ఉద్యోగాన్ని వదిలి, నచ్చిన పనిచేస్తూ ముందుకు వెళ్తున్నా అని వివరించాడు. వ్యాపారాన్ని నిర్మించే ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని కూడా తెలిపాడు. ఇది జీవితంలో మనసుకు నచ్చిన పనిని చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

చేసేపనిలో కేవలం విజయం మాత్రమే కాదు.. అపజయం, కష్టాలు వస్తాయని.. ఆత్మవిశ్వాసం తగ్గినా రోజులు కూడా ఉన్నాయని మెహుల్ వీడియోలో వెల్లడించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగాలను తాము కూడా ఎదుర్కొన్నామని కొందరు వెల్లడించారు. మరికొందరు వ్యాపార జీవితంలోని ఒత్తిడి, అనిశ్చితి గురించి నిజాయితీగా మాట్లాడినందుకు ఆయనను ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement