వ్యాపారంలో విజయం సాధించాలంటే.. కేవలం డబ్బు, తెలివి, కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. ఒక నిజమైన వ్యాపారవేత్తకు అత్యంత ముఖ్యమైన ఆస్తులు రెండు. అవి అతని మెదడు, జీవితాంతం నేర్చుకునే తపన. వీటితో పాటు అతని సలహాదారుల బృందం ఉండాలి అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత కియోసాకి.
ప్రతి వ్యాపారవేత్త తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది. కొత్త ఆలోచనలు, సాంకేతికతలు, మార్కెట్ మార్పులు వస్తూనే ఉంటాయి. నేను అన్నీ తెలుసుకున్నాను అని భావించే వ్యక్తి ఎప్పటికీ ఎదగలేదు. కాబట్టి వ్యాపారవేత్త ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి.
ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడైనా.. ఒంటరిగా ఉంటే ఏమీ సాధించలేడు. ఒక మంచి బృందం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రతి మనిషికి ఇతరుల సహాయం అవసరం. వ్యాపారంలో కూడా ఇదే నిజం. మంచి సలహాదారులు ఉంటే వ్యాపారం బలంగా నిలబడుతుంది.
వ్యాపారవేత్తకు అవసరమైన సలహాదారులు
బుక్ కీపర్: వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయి లెక్కను కచ్చితంగా నమోదు చేస్తాడు. సరైన లెక్కలు లేకపోతే వ్యాపారం గందరగోళంలో పడుతుంది.
అకౌంటెంట్: పన్నులు, ఆర్థిక ప్రణాళికలు, ఖర్చులకు సంబంధించిన సలహాలు ఇస్తాడు.
అటార్నీ: చట్టపరమైన సమస్యల నుంచి వ్యాపారాన్ని రక్షిస్తాడు.
మార్కెటింగ్ మేనేజర్: ఉత్పత్తిని ప్రజలకు చేరవేస్తాడు. మంచి మార్కెటింగ్ లేకపోతే మంచి ఉత్పత్తి కూడా గుర్తింపు పొందదు.
ప్రొడక్ట్ డెవలపర్: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తాడు.
బ్యాంకర్: ఆర్థిక సహాయం, పెట్టుబడులపై మార్గనిర్దేశం చేస్తాడు.
బంగారం, వెండి బ్రోకర్: విలువైన లోహాలలో పెట్టుబడులపై సలహా ఇస్తాడు.
స్టాక్ అండ్ బాండ్ బ్రోకర్: షేర్లు, బాండ్లు వంటి పెట్టుబడులపై అవగాహన కల్పిస్తాడు.
Entrepreneurs most important assets:
1: Their brain and dedication to life long learning.
2: Their team of advisors.
Who is on your team of advisors?
Do you have?
1: Book keeper for accurate numbers
2: Accountant
3: Attorney
4: Marketing manager
5: Product…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 16, 2026
ఈ టీమ్ కలిసి పనిచేస్తే, వ్యాపారవేత్తకు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఒంటరిగా పని చేసే మేధావి కంటే, మంచి సలహాదారులతో కూడిన బృందం మంచి విజయాన్ని సాధిస్తుంది.
పాఠశాలలో చదుకునేటప్పుడు తప్పులు చేసే టీచర్ శిక్షిస్తారు. అందుకే చాలామంది ఉపాధ్యాయులు వ్యాపార ప్రపంచంలో పెద్దగా ఎదగలేరని కియోసాకి అన్నారు. నిజ జీవితంలో తప్పులు చేయడం సహజం. వాటి నుంచి నేర్చుకోవడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!


