ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 14-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Mar 14 2026 3:45 AM | Updated on Mar 14 2026 5:10 AM

Rasi Phalalu: Daily Horoscope On 14-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.ఏకాదశి పూర్తి (24 గంటలు), నక్షత్రం: ఉత్తరాషాఢ రా.3.11 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.9.55 నుండి 11.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.22 నుండి 7.48 వరకు, అమృత ఘడియలు: ఉ.8.07 నుండి 9.51 వరకు.

సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం... దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త  పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలలో అనుకూలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం... మిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

మిథునం.... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు.

కర్కాటకం... నిరుద్యోగులకు శుభవార్తలు. పనులు సమయానికి పూర్తి కాగలవు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.  పుణ్యక్షేత్రాల సందర్శనం.

సింహం..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని  హోదాలు.

కన్య.... పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు పనిభారం.

తుల.... పనుల్లో  కొన్ని ఆటంకాలు. మిత్రులు, బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం..... ఉత్సాహంగా పనులు సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు... కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మకరం...... కార్యజయం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ముఖ్య  నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

కుంభం.... శ్రమ తప్పదు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement