కెప్టెన్సీ ఎవరు కాదనుకుంటారు? అందరూ కోరుకునేదే, అందరికీ బాగా కావాల్సిందే! బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. అయితే కంటెండర్లకు డైరెక్ట్‌గా గేమ్ పెట్టకుండా.. హౌస్‌మేట్స్ సాయంతో గెలిచే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మాత్రమే మిగిలారు. ఏ హౌస్‌మేట్ అయితే రైలెక్కి కూర్చుంటాడో అతడు ఒకర్ని రేసు నుంచి తీసేయొచ్చు.
మోసం చేసిన దివ్య?
అలా ఒక్క కుర్చీ కోసం హౌస్‌మేట్స్ పోటీపడ్డారు. కల్యాణ్ చేతిలో కుర్చీ ఉంటే.. నేను చెప్పేది విను అంటూ అతడికి నచ్చజెప్పి కుర్చీలో కూర్చుంది దివ్య. నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్‌కు అని చెప్తూ.. తనూజను గేమ్‌లో అవుట్ చేసింది. అది విని షాకైన తనూజ.. నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావ్? అని కోప్పడింది. తనూజను ఎలిమినేట్ చేయవు అన్నందుకే కల్యాణ్ నీకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసింది.
చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు
ఇంతలో కల్యాణ్ కూడా మధ్యలో కలగజేసుకుంటూ.. నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయమే కాదు, నిన్ను నమ్మి ఇచ్చానని తలపట్టుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధలో ఉన్న తనూజ.. నాతో మాట్లాడకు, నీకేమైన పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని దివ్యకు చెప్పి, ఆ వెంటనే బోరుమని ఏడ్చేసింది. కెప్టెన్ అవాలని చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి ఓదారుస్తుంటే కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ మాట్లాడొద్దు అని వేడుకుంది. ఇక చివర్లో రీతూ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.


