బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్‌మేట్ అయిన భరణికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..
భరణి చేతిలో పవర్
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.

తనూజ వర్సెస్ కల్యాణ్
రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్‌పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు.
డీజే డ్యాన్స్
ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు.

బొమ్మలా నిల్చున్న భరణి
దీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్‌లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్‌లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!
కెప్టెన్‌గా దివ్య
తనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్‌గా ఎలా ఉంటుందో చూడాలి!
చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్


