దివ్యకు తక్కువ ఓట్లు.. ఆ రెండు కారణాల వల్లే! | Bigg Boss 9 Telugu: Divya Nikhita Danger Zone with Her Behaviour | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: నెక్స్ట్‌ టార్గెట్‌ దివ్య? తెలిసి మరీ తప్పు చేస్తోందా?!

Nov 16 2025 2:51 PM | Updated on Nov 16 2025 3:06 PM

Bigg Boss 9 Telugu: Divya Nikhita Danger Zone with Her Behaviour

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్‌) ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్‌ జోన్‌లో నిఖిల్‌, గౌరవ్‌తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.

ఆ రెండింటి వల్లే..
నిఖిల్‌ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్‌, దివ్య (Divya Nikhita)ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్‌ అని నాగ్‌ ప్రకటించాడు. షూటింగ్‌ ఆల్‌రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్‌ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్‌ కార్డ్‌గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్‌ జోన్‌లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్‌ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.

ఆ గేమ్‌ కొంప ముంచింది
గత వారం కెప్టెన్సీ గేమ్‌లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్‌ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్‌లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్‌ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.

తనూజపై కుళ్లు?
ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్‌లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్‌ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్‌ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.

గండం
బీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్‌ టాస్క్‌లు చేసినప్పటికీ ఆ క్రెడిట్‌ అంతా సుమన్‌కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్‌ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్‌ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్‌ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి!

 

చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చైతన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement