బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో చై ఫుల్ ఎనర్జీతో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించారు.
మెలికలు తిరిగిన రీతూ
అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఓనర్‌ని నేనే.. అని చై చెప్పడంతో నాగ్ (Nagarjuna Akkineni) సర్‌ప్రైజ్ అయ్యాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్? అని అడిగాడు. చైని చూడగానే రీతూ మెలికలు తిరిగిపోయింది. మీరంటే పిచ్చి, ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది. దీంతో నాగ్ రీతూకి ఓ బంపరాఫర్ ఇచ్చాడు. చైతూకి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్‌లో నుంచి బయటకు వస్తే చై నిన్ను బైక్ రైడ్‌కు తీసుకెళ్తాడు అని చెప్పాడు.
రైడ్‌కు తీసుకెళ్తా..
అంతే, రీతూ (Rithu Chowdary) ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటకు వచ్చేస్తానంది. అది చూసి ఆశ్చర్యపోయిన చై.. బిగ్‌బాస్ షో ఎందుకు వదులుకుంటావ్? గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్‌కు తీసుకెళ్లొచ్చు అన్నాడు. అందుకు రీతూ.. మిమ్మల్ని జోష్ నుంచి గెల్చుకుందామనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టింది. అది చూసి తండ్రీకొడుకులిద్దరూ ఏం మాట్లాడలేక నవ్వుకున్నారు.


