అది నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటా! | Movie Actress Jyothi About Her Personal Life | Sakshi
Sakshi News home page

Jyothi: చిరంజీవితో సినిమా చేశాక నన్ను నేను తూ.. అని!

Nov 16 2025 10:26 AM | Updated on Nov 16 2025 11:27 AM

Movie Actress Jyothi About Her Personal Life

ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసిన జ్యోతి చాలాకాలంగా వెండితెరపై కనిపించడమే లేదు. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. కానీ, ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. ఇటీవల కొడుకుతో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.

అందుకే గ్యాప్‌
నేను పుట్టింది ఒరిస్సాలో అయినా విశాఖపట్నంలో పెరిగాను. 24 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. చిన్నప్పుడు డ్యాన్స్‌ అంటే పిచ్చి. హీరోయిన్‌ అవుదామనే హైదరాబాద్‌కు వచ్చాను. మొదటిసారి అందం సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్‌ అయ్యాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. వ్యాంప్‌ తరహా పాత్రలే తరచూ అడగడంతో కెరీర్‌కు గ్యాప్‌ ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పటికీ ఐటం సాంగ్స్‌ చేయమని అడుగుతున్నారు.

పెళ్లి చేసుకుని తప్పు చేశా..
ఏ సినిమాకు నేను కమిట్మెంట్‌ ఇవ్వలేదు. అయితే కెరీర్‌ బాగున్న దశలో పెళ్లి చేసుకుని తప్పటడుగు వేశాను. నేను ఒకబ్బాయిని ప్రేమించాను. వాడు నన్ను మోసం చేశాడు. ఆ కోపంలో నాకు ప్రపోజ్‌ చేసిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అదే నేను తీసుకున్న చెత్త నిర్ణయం. బాబు పుట్టిన రెండేళ్లకే మాకు విడాకులయ్యాయి. అప్పటినుంచి సింగిల్‌గానే ఉన్నాను. విడాకులయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎదురుచూశాను. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను.

అద్దంలో చూసుకుని..
అందరివాడు సినిమాలో చిరంజీవితో కాంబినేషన్‌ సీన్‌ ఉంది చేస్తావా? అని అడిగారు. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చిన నేను సంతోషంతో ఓకే చెప్పాను. తీరా చూస్తే చిరంజీవిని పెళ్లి చూపుల్లో రిజెక్ట్‌ చేసే సీన్‌ అది. ఆ సన్నివేశం చేసి ఇంటికొచ్చాక అద్దంలో నన్ను నేను చూసుకుని తూ, నేను చిరంజీవిని రిజెక్ట్‌ చేయడమేంటి? అని నన్ను నేను తిట్టుకున్నాను.

సినిమా
అలాగే ఈ కాలం అమ్మాయిలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. పెళ్లయినవాడి జోలికెళ్లకండి.. అంతకంటే దారుణం మరొకటి ఉండదు, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చింది. జ్యోతి.. పెళ్లాం ఊరెళితే, ఎవడిగోల వాడిది, మహాత్మ, దరువు, కెవ్వు కేక వంటి పలు చిత్రాల్లో నటించింది.

చదవండి: బిగ్‌బాస్‌ 9 సంజనాకి ఫ్యామిలీ వీక్‌ లేనట్లేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement