ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
భరణి రాకతో ఆనందభాష్పాలు
భరణి (Bharani Shankar) హౌస్‌లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్‌కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.
దివ్యను పట్టించుకోని భరణి
నిఖిల్.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.
నామినేషన్స్‌లో ఎనిమిది మంది
శ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారన్నాడు బిగ్‌బాస్.
రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్
ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్‌మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!
చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్


