
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.
ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్‌లో ఉంచిన తన స్టిక్కర్స్‌ని ఎవరు తీశారని సీరియస్ అయింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్‌తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.
(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)
దీని తర్వాత కిచెన్‌లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.
పర్సనల్‌గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్‌లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.
(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)