బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో దివ్యకు తనూజ అంటే ఏమూలనో కోపం, ద్వేషం, అసూయ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ కాలికి వాపు వచ్చిందని భరణి ప్రేమగా ఆయింట్‌మెంట్ పూసి మసాజ్ చేశాడు. అది దివ్య తట్టుకోలేకపోయింది. మీ ఆరోగ్యమే బాగోలేదు. చేయి నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా? అని అరిచింది. ఎవరో ఒకరు చేస్తారుగా.. మీరెందుకు చేయడం అని తిట్టేసింది.
తనూజపై అక్కసు
పోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా? అంటే.. పోయినవారం బీబీ రాజ్యం గేమ్‌లో భరణితో మసాజ్ చేయించుకుంది. మరి అప్పుడు భరణి నొప్పి గుర్తురాలేదా? అన్నది తనకే తెలియాలి. ఇప్పుడు తనూజ (Thanuja Puttaswamy)పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది. కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచి తప్పించాలన్నాడు బిగ్‌బాస్.

ఒంటికాలిపై లేచిన తనూజ
దీంతో దివ్య.. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్‌రెడీ కెప్టెన్‌గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అని తనూజను తీసేసింది. దాంతో తనూజ.. నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా.. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా.. 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా అని దివ్య సమర్థించుకుంది.
గేమ్ కోసం వాడుకోను
బానే చెప్పుకున్నావ్ పో.. అని తనూజ వెక్కిరించడంతో దివ్యకు బీపీ లేచింది. నువ్వెవరు పో అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వేలు చూపించి మాట్లాడింది. అయినా వెనక్కు తగ్గని తనూజ.. ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అని వెటకారం చేసింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని దివ్య అంది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు.


