బిగ్‌బాస్‌కే ఆర్డరేసిన తనూజ.. భరణిఫైర్‌.. | Bigg Boss 9 Telugu: Bharani Shankar Fires On Thanuja | Sakshi
Sakshi News home page

వాగుడు, పిచ్చిమాటలు అనొద్దు.. భరణిపై తనూజ ఫైర్‌

Nov 29 2025 2:51 PM | Updated on Nov 29 2025 3:33 PM

Bigg Boss 9 Telugu: Bharani Shankar Fires On Thanuja

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొన్ని సరదా టాస్కులు, ప్రమోషనల్‌ టాస్కులుంటాయి. అవి ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో ఫ్లోలో సరదాగా ఆడుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ కూడా గొడవపడొచ్చని తాజా ప్రోమోతో రుజువైంది. ప్రోమోలో చూపించినదాని ప్రకారం.. భరణి, ఇమ్మాన్యుయేల్‌, సుమన్‌ ఒక టీమ్‌ అయితే రీతూ, తనూజ, కల్యాణ్‌ మరో టీమ్‌గా విడిపోయారు. 

బిగ్‌బాస్‌కే ఆర్డర్‌
భరణి టీమ్‌లో ఉన్న దివ్య ఈ గేమ్‌కు సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ ఆటలో భరణి టీమ్‌ గెలవగా తనూజ టీమ్‌ ఓడిపోయింది. అది తనూజ జీర్ణించుకోలేకపోయింది. ఈ సీజన్‌ మొత్తం దివ్యనే సంచాలకురాలిగా పెట్టండి అని బిగ్‌బాస్‌కే ఆర్డరేసింది. అది చూసి చిరాకుపడ్డ భరణి.. రూల్స్‌ నీకు ఒక్కదానికే తెలిసినట్లు మాట్లాడతావేంటి? అని అసహనం వ్యక్తం చేశాడు.

తనూజపై భరణి ఫైర్‌
అప్పటికీ తనూజ (Thanuja Puttaswamy) తగ్గకపోయేసరికి.. నేను ఊరికే లొడలొడా వాగను.. అవసరమైనప్పుడు కచ్చితంగా మాట్లాడతా అన్నాడు. వాగుడు, పిచ్చి మాటలు అని మీరనకండి.. అంటూ భరణితో అడ్డంగా వాదించింది తనూజ. ఇది చూసిన జనాలు.. ఇక్కడ కూడా గొడవేంట్రా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement