జేసీబీతో అరటి పంటను తొలగిస్తున్న రైతు ఆనం రామిరెడ్డి
బోరంపల్లిలో పంట తొలగించిన రైతు ఆనం రామిరెడ్డి
ప్రభుత్వ మద్దతు ధర కరువు... రూ.5 లక్షల వరకూ నష్టం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లాలో అరటి రైతుల ఆక్రందనలు వినేవారే కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అరటి పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో రైతన్నలు పంటను జేసీబీలతో తొలగిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన రైతు ఆనం రామిరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల పొలంలో అరటి పంట సాగు చేశాడు. రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు.
తీరా పంట చేతికొచ్చాక ధర పడిపోయింది. కిలో అరటి రూ.2లతో కొనేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఇలా రెండు మార్లు పంటను కోస్తే రైతుకు కేవలం రూ.లక్ష చేతికందింది. పైగా తోటలోనే పండ్లు కుళ్లిపోతుండటంతో చేసేదేమీలేక సోమవారం ఉన్న పంటను జేసీబీతో తొలగించేశాడు. రూ.5 లక్షల వరకు నష్టం వచి్చందని ఆవేదన వ్యక్తం చేశాడు.


