సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య ధోరణితో ఏపీలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయింది. ఈ క్రమంలో అరటి రైతులకు ‘నేనున్నాను’ అనే భరోసా వైఎస్ జగన్ ఇవ్వనున్నారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బుధవారం వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అరటి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు సర్కార్‌ను డిమాండ్ చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’!
రైతులతో ముఖాముఖి తర్వాత పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.


