శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎంపీ మిధున్‌రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురి చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ వేధింపు చర్యలను తాను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయమన్నారు. వైఎస్సార్‌సీపీ సంస్థాగత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మిథున్‌రెడ్డి సూచించారు.


