పల్నాడు: గురజాలలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతల బెదిరింపులతో ఊరు విడిచి వెళ్లిపోయాడు సాల్మాన్.
అయితే తాజాగా కుటుంబ సభ్యుల్ని చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు సాల్మాన్. దీన్ని అదునుగా చేసుకుని ‘నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మా గ్రామంలోకి వస్తావా’ అంటూ సాల్మన్‌పై దాడికి పాల్పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు.


