పెద్ద బడ్జెట్ సినిమా తీయను

‘‘జీవితంలో ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు. నా తుది శ్వాస వరకు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. నేడు ఆయన 63వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2004లో నేను మొదటి సినిమా తీశాను. ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను. 99వ చిత్రం రామ్‌గోపాల్ వర్మతో ఉంటుంది.
నూరవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఒక శతాధిక దర్శకుడు మాట ఇచ్చారు. 101వ సినిమాగా ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు ఉదయభాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జేకే భారవి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గాక 102వ చిత్రం ఉంటుంది. దీనికి సాయి ప్రకాష్‌గారు దర్శకుడు. చిన్న సినిమాలకు ఓటీటీ/ఏటీటీలే మార్గం. పెద్ద సినిమాలు థియేటర్‌లో చూస్తే ఆ థ్రిల్, ఆ అనుభూతి బాగుంటుంది’’ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి