మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో మోసాలు మరింత ఎక్కువయ్యాయి. సైబర్ క్రైమ్స్‌తో పాటు ధనార్జనే ధ్యేయంగా పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కాల్, ఆడిషన్స్ పేరిట ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.
నిర్మాత నవీన్ యెర్నేని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మా దృష్టికి వచ్చిందని తెలిపింది. దయచేసి అది నకిలీ ఖాతా అని గుర్తించాలని ప్రజలను కోరింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి కాస్టింగ్ కాల్ మా అధికారిక హ్యాండిల్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. మా చిత్రాల పేరు చెప్పుకునే వ్యక్తులు లేదా ఏజెన్సీలతో ఎవరూ సంభాషించవద్దని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి తప్పుదారి పట్టించే ప్రొఫైల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Every casting call from Mythri Movie Makers will only be announced through our official handle @MythriOfficial. We request everyone not to engage with any individuals or agencies claiming to cast for our films.
Additionally, an Instagram account impersonating Mr. Naveen Yerneni…— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2025


