రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ మూవీలో చేస్తున్నారు. అంతేకాకుండా హను రాఘవపూడితో జతకట్టారు మన బాహుబలి హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంంలో హీరోయిన్‌గా ఇమాన్వి కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్యాప్షన్ రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను వీడియోను రూపంలో పోస్ట్ చేసింది. కాగా.. ప్రభాస్ గతంలో కూడా తన సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తానే భోజనాలు తయారు చేయించారు. తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నారు.
(ఇది చదవండి: 'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్‌గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ)

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో పీరియాడికల్ డ్రామా 'ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.


