టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మూవీ ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని అన్నారు. ఆది సాయికుమార్ నటించిన శంబాలకు అద్భుతంగా ప్రమోషన్స్ చేయడం వల్లే సక్కెస్ సాధించారని అన్నారు. నేను చేసింది చిన్న రోలే అయినా.. ఏప్రిల్ నుంచే ప్రమోషన్స్ ప్రారంభించారని అన్నారు.
శ్రీకాంత్ తనయుడు ఛాంపియన్ మూవీ కూడా చాలా బాగుందని హర్షవర్ధన్ అన్నారు. కానీ జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనకపడ్డారని తెలిపారు. ఈ వీడియో నిర్మాతలు కూడా చూడాలని అన్నారు. ఛాంపియన్ లాంటి మంచి సినిమాకు ఇంకా గొప్పగా ప్రమోషన్స్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే ప్రధామమని పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనేది వందశాతం నిజమన్నారు. ప్రమోషన్స్‌పై హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘శంబాల’ సినిమా దెబ్బకి ‘ఛాంపియన్’ సినిమా కనిపించకుండా పోయింది...
చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే...
ఈ వీడియో ప్రొడ్యూసర్ #AswaniDutt చూడాలి
- Actor #HarshaVardhan#Shambala #Champion #ManaShankarVaraPrasadGaru pic.twitter.com/FDhGLvMksW— TeluguOne (@Theteluguone) January 22, 2026


