బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దేశ ఆర్థిక రాజధాని ఓటర్లంతా ఎవపరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం సంప్రదాయంగా ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ మూకుమ్మడిగా బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి.
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్ర స్థానికులతో పాటు ముస్లిం ఓటర్లు శివసేన (యూబీటీ) వైపు నిలువగా, దక్షిణాది, ఉత్తరాది ప్రజలు యువత మహిళలు బీజేపీ వైపు నిలిచిట్లు ఎగ్జిట్ పోల్ట్ అంచనా వేశాయి. నాలుగు ప్రముఖ ఎగ్జిట్‌పోల్ సంస్థలు ఫలితాలు ప్రకటించాయి. వాటి వివరాలు.
జన్‌మత్ : బీజేపీ కూటమికి -138 సీట్లు, శివసేన ( యూబీటీ) 62, కాంగ్రెస్ 20 ఇతరులు 7 అని అంచనా వేసింది.
యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 131-151, శివసేన ( యూబీటీ) 58-68, కాంగ్రెస్ 12-16 ఇతరులు 6-12 స్థానాలు గెలవనున్నట్లు తెలిపింది.
టైమ్స్ నౌ బీజేపీ కూటమి: 129-146, శివసేన యూబీటీ 54,64, కాంగ్రెస్ కూటమి ఇతరులు 6-9 స్థానాలు గెలవనున్నట్లు ప్రకటించింది.
న్యూస్-18- బీజేపీ కూటమి: 119,శివసేన యూబీటీ 75, కాంగ్రెస్ కూటమి 20 ఇతరులు 14 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించింది.
అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి.


