పదివారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్ ఈ వారం ఫుల్ జోష్‌లో ఉన్నారు. కారణం.. ఇది ఫ్యామిలీ వీక్. అమ్మానాన్న, చెల్లి, భార్య.. ఇలా ఎవరో ఒక రక్తసంబంధీకులు తమకోసం బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌కు రావడం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నారు. ఇప్పటికే సుమన్, తనూజ, పవన్, దివ్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈరోజు రీతూ తల్లి హౌస్‌లోకి రానుంది.

రీతూకి క్లాస్
ఈమేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో రీతూ తల్లి హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకుంది. ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్రీజ్ అంటూ కంటెస్టెంట్లను ఓ ఆటాడించింది. తల్లిని చూడగానే మిస్‌యూ అంటూ రీతూ ఏడుపందుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం.. నిన్ను కొడ్తా.. నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అని పవన్‌తో లవ్ ట్రాక్ గురించి పరోక్షంగా నిలదీసింది.
ఏడుపందుకున్న రీతూ
మనం పక్కకెళ్దాం అమ్మ.. అని రీతూ అడిగితే చపాతీ కర్ర అందుకుని కొట్టేందుకు సిద్ధమైంది. కానీ రీతూ ఏడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఎంతైనా తల్లి మనసు కదా.. కూతురి కన్నీళ్లు చూశాక కొట్టే సాహనం చేయలేకపోయింది.


