breaking news
F1 Movie
-
రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్‌లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్‌పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్‌పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్‌గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్‌లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్‌పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్‌కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్‌కి అతుక్కుపోయాలా చేస్తుంది.ఎవరెలా చేశారు?సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో సైలెన్స్తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)అమెజాన్ ప్రైమ్మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18ఎక్స్టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23హాట్స్టార్స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22సన్ నెక్స్ట్కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేవుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్) -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్‌గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది
రీసెంట్ టైంలో మూవీ లవర్స్‌ని ఆకట్టుకున్న హాలీవుడ్ సినిమా 'ఎఫ్ 1'. రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్ హీరోగా నటించాడు. రేసింగ్ తరహా మూవీస్‌ని ఇష్టపడే వాళ్లకు ఇది పిచ్చిపిచ్చిగా నచ్చేస్తోంది. అంతెందుకు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షిస్తూ నెటిజన్ల కంటికి చిక్కారు.ఈ మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. కాకపోతే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' నిర్మించిన ఈయన.. జూలై 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'ఎఫ్ 1' గురించి ప్రస్తావిస్తూ.. ఇది తనకు 'జెర్సీ' మూవీలా అనిపించిందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)'ఈ కంపేరిజన్ చెప్తే ఆడియెన్స్ నన్ను తంతారు ఏమో, కాంట్రవర్సీ కూడా అవుద్ది. ఎఫ్ 1 సినిమా నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది కానీ ఎండ్ పొజిషన్ చూస్తుంటే 'జెర్సీ' గుర్చొచ్చింది. రేస్‌కి వెళ్తాడా లేదా మెడికల్ కండీషన్ కానీ జెర్సీ చూసినట్లు అనిపించింది' అని నాగవంశీ చెప్పారు.నాని హీరోగా నటించిన ఈ క్రికెట్ డ్రామా సినిమాని నాగవంశీనే నిర్మించారు. ఆ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' తీశాడు. దీనిపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండకు గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. అందుకే ఈ మూవీపై సదరు హీరోతో పాటు ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ)