సినీ ఇండస్ట్రీలో వారసులు, నెపోటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలా ఈమె కూడా తల్లితండ్రి హీరోహీరోయిన్ కావడంతో సులువుగానే నటి అయిపోయింది. కాకపోతే పట్టుమని ఐదు మూవీస్ చేసిందో లేదో పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం తెరపై ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అక్షర హాసన్. ఈమె తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చిన్న కూతురు. కమల్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. గతంలో హీరోయిన్ సారికతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వాళ్లే శ్రుతి హాసన్, అక్షర హాసన్. శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేసే రేంజుకి వెళ్లింది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)
మరోవైపు అక్షర పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా తయారైంది. తల్లిదండ్రుల్లానే అక్షర కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అలా 2010లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మణిరత్నం తీసిన 'కడలి' మూవీలో ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో లెక్కలు మారిపోయాయి. అలా కొన్నాళ్ల పాటు దర్శకత్వం విభాగంలో మెలకువలు నేర్చుకున్న అక్షర.. 2015లో 'షామితాబ్' మూవీతో నటిగా మారింది.
తొలి సినిమాలోనే(హిందీ) అమితాబ్ బచ్చన్, ధనుష్ లాంటి స్టార్స్‌తో నటించింది. కానీ ఏం లాభం? ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయింది. తర్వాత హిందీలో మరో మూవీ.. అనంతరం తమిళంలో మూడు చిత్రాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా అక్షరకు ఉపయోగపడలేకపోయాయి. చివరగా 2022లో ఓ సినిమాలో కనిపించిన అక్షర.. తర్వాత నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే తల్లితో కలిసి ముంబైలో ఉంటోంది. తాజాగా తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న తన చిన్నప్పటి ఫొటోలని షేర్ చేసింది. అలా ఇప్పుడు మరోసారి అక్షర హాసన్.. వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్')


